Friday 2 July 2010

నిజం, నమ్మకం

"Science can become an irrational cult, prompts one to dismiss as nonsense anything that modern science has not discovered yet, or cannot comprehend even it be truth based – direct experience".
- Sri Swami Vivekananda

భావం పాడవకుండా తెలుగులోకి మక్కీ కి మక్కీ అనువదించడం చేతకాక ఇంగ్లీష్ quote ని అలాగే రాశాను. ఈ వాక్యం చాలా నిజమనిపించింది నాకు.దేవుడన్నా, మన సాంప్రదాయాలన్నా, మన నమ్మకాలన్నా ఎంతో అభిమానం నాకు. వాటికి సంబంధించి ఏదైన కొత్త విషయం తెలిస్తే ఎంతో సంతోషపడిపోయి,సంతోషానికి మించిన ఆసక్తితో తెలుసుకుంటూ వుంటాను నేను. అదేమిటో మన నమ్మకాలలో ఏదో సీక్రెట్ దాగి వుంటుంది ఏప్పుడూ. కొన్నిసార్లు అవి నాకు ఎంతో ఉత్సుకత కలిగిస్తాయి. యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి ప్రయొజనాలు విన్నప్పుడు వాటి గురించి విని నేను కూడా ఆచరిస్తాను. అలా ఎంతగా వాటి మీద ఇష్టం వున్నా, కొన్ని సందర్భాలలో ఇవన్నీ జరిగే పని కాదులే, గాలి నుంచి ప్రాణశెక్తి రావడమేంటి, కళ్ళు మూసుకుని కూర్చుంటే మనలోకి మనం చూసుకోవడమేంటి, ఏదో ఆహ్లాదకరమైన కొత్త ప్రపంచాన్ని చూడటమేంటి, ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడ logic కనపడదు నాకు. ఇక్కడ మన నమ్మకానికన్నా logic లేదన్న నిజమే మన ఆలోచనల్ని dominate చేస్తుంది. నాకే కాదు చాలా మందికి ఇలానే అనిపిస్తుంది. దేవుడ్ని నమ్మేవారు కూడా దేవుడు నిజంగా ఎదుట ప్రత్యక్షమైతే భయపడతారేమో, ఎందుకంటే దెవుడనే వాడు లేడని ఎక్కడో ఏ మూలో వాళ్ళ మనసులో ఒక నమ్మకం.

నమ్మడం నమ్మకపోవడం సంగతటుంచితే అసలు ఈ సంశయానికి కారణం ఎంటంటే, ఇలాంటి వాటిని prove చేసే theories లేక పోవడం. ఇంకా పక్కాగ చెప్పాలంటే సైన్స్ లో ఇందుకు రుజువులు లెకపోవడం. నేను విన్న history లో గెలీలియో, కోపెర్నికస్ లాంటి వారు అప్పటి నమ్మకాల్ని కాదని సైన్స్ పరంగా విశ్వానికి సంబందించిన సత్యాల్ని వెలుగులోకి తెస్తే నమ్మకాల మీద విశ్వాసంతో ప్రజలు వారిని నానా హింసలూ పెట్టారు. కాని ఇవ్వల్టి పరిస్థితి ఇందుకు పూర్తిగ భిన్నంగా వుంది. సైన్స్ ని నమ్ముతున్న ప్రజలు ఇప్పుడు నమ్మకానికి రుజువులు అడుగుతున్నారు.

శ్వాస వల్ల ప్రాణం నిలుస్తుంది, శ్వాసలో ప్రాణశక్తి ఉండటానికి అస్కారం ఉంది. SMS చేయగలిగినప్పుడు Telepathy కి కూడా ఆస్కారం ఉంది. వస్తువుని ఆకర్షించే శక్తి ఉన్నప్పుడు మనసును ఆకర్షిషించే శక్తి ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ శక్తే దేవుడైయ్యే అవకాశమూ ఉంది. నమ్మకాల వల్ల సైన్స్ ని కాదనటం ఎంత వెర్రో సైన్స్ వల్ల నమ్మకాలని కాదనటం కూడా అంతే వెర్రి అనిపిస్తుంది.