Friday 2 July 2010

నిజం, నమ్మకం

"Science can become an irrational cult, prompts one to dismiss as nonsense anything that modern science has not discovered yet, or cannot comprehend even it be truth based – direct experience".
- Sri Swami Vivekananda

భావం పాడవకుండా తెలుగులోకి మక్కీ కి మక్కీ అనువదించడం చేతకాక ఇంగ్లీష్ quote ని అలాగే రాశాను. ఈ వాక్యం చాలా నిజమనిపించింది నాకు.దేవుడన్నా, మన సాంప్రదాయాలన్నా, మన నమ్మకాలన్నా ఎంతో అభిమానం నాకు. వాటికి సంబంధించి ఏదైన కొత్త విషయం తెలిస్తే ఎంతో సంతోషపడిపోయి,సంతోషానికి మించిన ఆసక్తితో తెలుసుకుంటూ వుంటాను నేను. అదేమిటో మన నమ్మకాలలో ఏదో సీక్రెట్ దాగి వుంటుంది ఏప్పుడూ. కొన్నిసార్లు అవి నాకు ఎంతో ఉత్సుకత కలిగిస్తాయి. యోగ, ప్రాణాయామం, ధ్యానం వంటి వాటి ప్రయొజనాలు విన్నప్పుడు వాటి గురించి విని నేను కూడా ఆచరిస్తాను. అలా ఎంతగా వాటి మీద ఇష్టం వున్నా, కొన్ని సందర్భాలలో ఇవన్నీ జరిగే పని కాదులే, గాలి నుంచి ప్రాణశెక్తి రావడమేంటి, కళ్ళు మూసుకుని కూర్చుంటే మనలోకి మనం చూసుకోవడమేంటి, ఏదో ఆహ్లాదకరమైన కొత్త ప్రపంచాన్ని చూడటమేంటి, ఎలా సాధ్యం అనిపిస్తుంది. ఇక్కడ logic కనపడదు నాకు. ఇక్కడ మన నమ్మకానికన్నా logic లేదన్న నిజమే మన ఆలోచనల్ని dominate చేస్తుంది. నాకే కాదు చాలా మందికి ఇలానే అనిపిస్తుంది. దేవుడ్ని నమ్మేవారు కూడా దేవుడు నిజంగా ఎదుట ప్రత్యక్షమైతే భయపడతారేమో, ఎందుకంటే దెవుడనే వాడు లేడని ఎక్కడో ఏ మూలో వాళ్ళ మనసులో ఒక నమ్మకం.

నమ్మడం నమ్మకపోవడం సంగతటుంచితే అసలు ఈ సంశయానికి కారణం ఎంటంటే, ఇలాంటి వాటిని prove చేసే theories లేక పోవడం. ఇంకా పక్కాగ చెప్పాలంటే సైన్స్ లో ఇందుకు రుజువులు లెకపోవడం. నేను విన్న history లో గెలీలియో, కోపెర్నికస్ లాంటి వారు అప్పటి నమ్మకాల్ని కాదని సైన్స్ పరంగా విశ్వానికి సంబందించిన సత్యాల్ని వెలుగులోకి తెస్తే నమ్మకాల మీద విశ్వాసంతో ప్రజలు వారిని నానా హింసలూ పెట్టారు. కాని ఇవ్వల్టి పరిస్థితి ఇందుకు పూర్తిగ భిన్నంగా వుంది. సైన్స్ ని నమ్ముతున్న ప్రజలు ఇప్పుడు నమ్మకానికి రుజువులు అడుగుతున్నారు.

శ్వాస వల్ల ప్రాణం నిలుస్తుంది, శ్వాసలో ప్రాణశక్తి ఉండటానికి అస్కారం ఉంది. SMS చేయగలిగినప్పుడు Telepathy కి కూడా ఆస్కారం ఉంది. వస్తువుని ఆకర్షించే శక్తి ఉన్నప్పుడు మనసును ఆకర్షిషించే శక్తి ఉండడానికి ఆస్కారం ఉంది. ఆ శక్తే దేవుడైయ్యే అవకాశమూ ఉంది. నమ్మకాల వల్ల సైన్స్ ని కాదనటం ఎంత వెర్రో సైన్స్ వల్ల నమ్మకాలని కాదనటం కూడా అంతే వెర్రి అనిపిస్తుంది.

Thursday 24 June 2010

కొత్త బంగారులోకం

"ఓరేయ్ సినిమాకి వెల్దామ్రా" కిరణ్ గాడు అడిగాడు.
"అన్నం తిన్న వెంటనే ఇలాంటి ఆలోచనలే వస్తాయి వీడికి!!" అనుకున్నా నేను మనసులో. అదేమిటోగాని ఆకలేసినప్పుడు, ఆకలి తీరినప్పుడు కిరణ్ గాడు చాలా వింతగా ప్రవర్తిస్తాడు. వీడి ప్రపోసల్ ఇంకా పూర్తి అవ్వనేలేదు ముని గాడు డ్రెస్స్ వేసుకుని రెడీ అయిపోయాడు. ఇంక చేసేది లేక నేను, భరత్ కుడా భయలుదేరాం.'కొత్తబంగారు లొకం' బావుందంటే దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సెకండ్ షో అయినా రష్ బాగానే వుంది. పర్లేదు ఇతే సినిమా బాగానే వుంది అనమాట అనుకున్నా మనసులో. మా వెనుక మాలాగానే నలుగురు కుర్రాళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళలో కిరణ్ గాడెవ్వరబ్బా?? అని నేను అలొచిస్తుండగానే సినిమా మోదలైంది.

అదేమిటో నాకు సినిమాలు అర్దంకాకనో లేక నిజంగానే సినిమాలు బాగోలేకనో నాకు తెలీదుకానీ నాకు చాలా సినిమాలు అంత త్వరగా నచ్చవు. కానీ ఎందుకో ఈ సినిమా బాగుంది. సినిమాలో నేను ఇన్వాల్వె అయిపోయి హీరోనే నేను, నేనే హీరో అయిపోయిన వేళ, నా చుట్టూ ఏమి జరుగుతోందో నేను గమనించె స్థితిలో నేను లేని వేళ, నేను చెప్పాల్సిన dialouge(నిజానికి సినిమాలో హీరో చెప్పాల్సిన dialouge)వెనుక వరుస నుంచి వినపడ్డది. అవ్వాక్కయి వెనక్కి తిరిగి చూశాను. వెనుక కుర్రాడు అప్పటికే సినిమా చుసాడు అని అర్దమైంది. నాలాగే తను కుడా సినిమాలో ఇన్వాల్వె అయిపొయి హీరో అయ్పొయాడని అనుకున్నా. నిజానికి నాలాగే ఫీల్ అయ్యెవాడు ఇంకొకడున్నాడని ముచ్చటేసింది. వినాయకుడు సినిమాలో హీరో క్రిష్ణుడు లాగ ఒక స్మైల్ ఇచ్చి మళ్ళి స్క్రీన్ వైపు తిరిగాను. రెండు నిమిషాలు గడిచాయొ లేదో " variety కదా...." అని మళ్ళీ వినపడింది, మొదట వెనుక నుంచి వినపడిన తర్వాత లేడి వాయిస్ లో మళ్ళి స్క్రీన్ మీదనుంచి వినపడింది. అప్పుడు మొదలైంది. బొమ్మ ముంధు కనిపిస్తుంటే మాట వెనక వినపడుతూ మళ్ళి అదే మాట స్క్రీన్ మీద వినపడుతూ వుంటే నా పరిస్థితి 'వివాహ భోజనమూ' సినిమాలో సుత్తి వీరభద్రావుకి దొరికిన బ్రహ్మానందంలాగా అయ్యింది నా పరిస్థితి. ఈలోపు మా అరవోడు (మునిగాడు అరవోడులెండి) "ఏమిరా కథ మొత్తం సెప్పేస్తాండాడు !!!" అంటూ మావాడు వాడి తెలుగరవం ( అదేనండి తెలుగు + అరవం )లో ఆశ్చర్యం వెల్లబుచ్చాడు. "నీకిప్పుడర్దమైందా ?? వెదవ వడివేలు మొహము నువ్వునూ" అనుకున్నాను నేను మనసులో.

మా బాధలు చూస్తున్నా కూడా వెనకాల వాడు కానీసం మమ్మల్ని కనికరించలేదు. ఇక మా నలుగురికి తిక్కలేచి వెనక్కి తిరిగి కూర్చున్నాం. స్క్ర్రీన్ చూడడం మానేశం వెనాక్కి తిరిగి వాడి మొహమే చుస్తున్నాం. మా అరవోడితే " ఆ ఇంకా తర్వత ఎమైనాది సెప్పుడా" అనడం మొదలుపెట్టాడు. పాపం వాడి మొహంలో రంగు పోయింది. నాకైతే జాలెసింది. కాని ఇంకొకసారి ఇలా చేయకుండా ఉంటాడనిపించింది.

Tuesday 15 June 2010

మళ్ళీ పుట్టని

ఊప్పొంగిన సంద్రం లా ఉవ్వెత్తున యెగిసింది
మనసును కడగాలని ఆశ...
కొడిగట్టే దీపం లా మినుకుమినుకుమంటోంది
మనిషిగ బ్రతకాలనే ఆశ...
గుండెల్లో ఊపిరై కల్లల్లో జీవమై
ప్రాణం లొ ప్రాణమై
మళ్ళీ పుట్టని... నాలో మనిషిని...
మళ్ళీ పుట్టని... నాలో మనిషిని

వేదం (2010)

Tuesday 6 April 2010

Right To Education

Right to education is a very good move by the government. Education is the basic necessity and a basic right. Bringing more children to schools will be a solution for many problems our society is facing right now.

Reservation of 25% seats for children of lesser income groups is a very good move, as this brings down the differentiation between the haves and have-nots which is taking inception at the elementary school level. Bringing up children together without having a distinction based on their economic status will be a very good step forward towards social integrity; also this gives quality education for these children. This also reminds the private sector of its social responsibility, that they too have the responsibility in dealing with social problems.

There are questions that are to be answered as well. Are the government schools in India unable to provide education to these 25% children? Out of all the schools in India only 7% are private schools. What difference is it going to make from 25% of 7%. If at all government schools are up to the standards why are so many parents joining their children into private schools. If poor quality in education is the reason for parents to join their children private schools, is a mere 25% seat in private schools going to fulfil the purpose of right to education act when 93% of total schools in India (government schools in India) are not able to provide quality education. Will these 25% be treated fairly by the school management as there are not paying anything? More over they will treat them as a burden. Most importantly will this children be able to meet the other cost and requirements that school put on children like bus fees, other fees for extracurricular activities, and won’t this cause a inferiority complex among these students who are not able to afford all these when their mates are enjoying all these facilities.

I had all these doubts when I was listening to Mr Kapil Sibal’s speech yesterday. May be I have very little idea of the facts, but I feel the questions I have are to be properly dealt with. I feel that’s its very important to bring out quality in government schools so that they stand in par with the private schools. If the quality in government schools is maintained, many parents of higher income groups will be willing to send their children to government schools as the private school fees are too high these days. this too will bring down the discrimination.

Wednesday 31 March 2010

దూరం

"అంత దూరం వెళ్ళాలా? ఇంటికి దగ్గరగా ఉండే స్కూల్లో ఎందుకు నన్ను చేరిపించలేదు?", ప్రతి రొజూ స్కూల్కి వెళ్ళేటప్పుడు బస్సు లో నాకు వచ్చే మొదటి ప్రశ్న. బస్సు కిటికీలోంచి నేను ఇంటి వైపు చుస్తూఉండగా అది దూరంగా వెళ్ళిపోతోంటే నా బాధ వర్ణనాతీతం. ఇంటికి బందువులు ఎవరైన వచ్చినప్పుడైతే అది మరీఎక్కువ. నిజానికి మా స్కూలు మా ఇంటికి కిలోమీటర్ కన్నా ఎక్కువ ఉండదు. కానీ ఆ మాత్రానికే ఇంటిని వదిలి వెళ్ళిపోతున్నంత బాధ.

ఆ బాధ, ఆ దూరం ఇంతింతా పెరుగుతూ వచ్చాయి. స్కూల్ తర్వత పక్క ఊరిలో కాలేజి, పక్క రాష్ట్రంలో డిగ్రీ, పరాయి దేశంలో ఉద్యోగం ఇలా కెరియర్ వంకతో పెరుగుతూనే ఉంది. ఎంతో దూరం అనిపించిన ఆ స్కూల్ ఈ రోజు చాలా దగ్గెరనిపిస్తుంది. నిజానికి ఇప్పుడున్న దూరానికి అది చాలా దగ్గెరే. బందువులు వస్తే వారిని విడిచి సాయంత్రం వరకు ఉండలేని పరిస్థితి అప్పటిదైతే, ఎవరికైన ఎదైన హాని జరిగినప్పుడు కుడా వారి దగ్గెర ఉండలేని పరిస్థితి ఇప్పటిది.

ఇంత వయసొచ్చినా ఇంటి మీద బెంగ పోకపోవడం నాకే విఢూరంగ అనిపించినా ఇంట్లో వాళ్ళ గుర్తొచినప్పుడు నేను బెంగపడటం సబబె అనిపిస్తుంది.

Monday 29 March 2010

ప్రార్ధన

మహా గణపతిం మనసా స్మరామి |
మహా గణపతిం
వసిష్ట వామ దేవాది వందిత

మహా దేవ సుతం గురుగుహ నుతం |
మార కోటి ప్రకాషం షాంతం ||
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహనా మోధక ప్రియం ||


ఏ పనైనా చేసే ముందు గణపతిని మొక్కడం నాకు అలవాటు. ఇతే ఇలా మొక్కడం చాలా మందికి అలవాటే. నాకు కుడా ఇంతకముందు ఇది ఒక అలవాటే. చిన్నప్పటి నుంచి దేవుని ముందు నిలుచుని చేతులు జోడించి కోరికల చిట్టా విప్పడం అలవాటైపోయింది. ఆ ప్రార్థనలో భక్తి, నమ్మకంలాంటి వాటికంటే మొక్కకపోతే దేవుడికి కోపం వస్తుందేమో అన్న భయమే ఎక్కువగా వుండేది. అలవాటులో ప్రార్ధన చెయ్యటానికి నమ్మకంతో ప్రార్ధించడానికి చాలా వ్యత్యాసముందని ఈ మధ్యనే అర్ధమైంది.

నమ్మకంతో కూడిన ప్రార్ధనలో కోరుకోవడం వుండదు, ఎందుకంటే మన కోరిక మనకన్నా ముందు దేవునికి తెలుసనే నమ్మకం. అటువంటి ప్రార్ధనలో దేవుడికి హామీలు (కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం లాంటివి) ఉండవు, ఎందుకంటే దేవుడు మన ఆశలు తీర్చేవాడే కాని మన నుంచి ఏమి ఆశించడని తెలుసు కనుక. మన భారాన్ని ఆయనకి వదిలేసాక ఎమౌతుందో అన్న చింతలు ఉండవు, మనకి ఏది మంచిదో అయనకి తెలుసన్న నమ్మకం.

దేవుడు వున్నా లేకపోయినా ఉన్నాడనే నమ్మకంతో చేసే ప్రార్ధన మనసును తేలిక చేస్తుంది, మన గురించి జాగ్రత్త తీసుకొవడానికి ఒకరున్నారనే ధైర్యాన్నిస్తుంది.

Sunday 21 March 2010

ఎప్పుడో

ఖాళీ సమయం నా ద్రుష్టిలో చాలా విలువైనది. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇక ముందు చెయ్యవలసిన పనులను ప్లాన్ చేసుకోవడం లాంటివి పక్కన పెడితే మనం ఇది వరకే చేసిన పనుల ఒత్తిడి నుంచి, మనకి ఒత్తిడిని పెంచే ఎన్నో అలోచనల నుంచి మనం ఉపసమనం పొందడానికి మనకి దొరికే మంచి అవకాశం.

నాకు దొరికిన నా ఖాళీ సమయాన్ని నేను మామూలుగా నాకు నచ్చిన పాటలు వినడం ఒక మంచి సినిమా చూడటం లేదా నాకు మనసుకు దగ్గెరైన నా వాళ్ళతో లేదా దగ్గరి స్నేహితులతో వాకింగ్కి వెళ్ళడం వంటి పనులతో గడుపుతూ ఉంటాను. వీటిలో కూడా నాకు బాగా ఎక్కువగ నచ్చింది దగ్గరి వారితో బయటకి వెళ్ళటం అయిన నా మూడ్ ని బట్టి లేదా నేనున్న పరిసరాలను బట్టి ఎదో ఒకటి చేస్తూ వుంటాను. ఒకసారి పాటలు మంచి ఉపశమనంగా అనిపిస్తే మరోసారి మంచి సినిమా చూడటం మంచి ఉపాయంగా అనిపిస్తుంది కాని ప్రతిసారి ఒకటే మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ పనిచెయ్యదు.

గత కొద్ది కాలంగా నేను పాటలు వినడం సినిమాలు చూడడం మాత్రమే ఉపసమనోపాయలుగా వాడుతున్నాను. దీనికి ముఖ్యకారణం నేను మనసుకు దగ్గెరైన వారందరికి భౌతికంగా దూరంగా వుండడం ఇతే మరో కారణం నేను ఉన్న చోట ఎవరూ దగ్గెరివారు కాలేకపోవడం. ఎందుకో చాలా రోజుల తర్వాత చల్ల గాలిలో సాయంత్రం పూట అయినవాళ్ళతో నడవాలనిపిస్తోంది.

అది కుదిరేది ఎప్పుడో???