మహా గణపతిం మనసా స్మరామి |
మహా గణపతిం
వసిష్ట వామ దేవాది వందిత
మహా దేవ సుతం గురుగుహ నుతం |
మార కోటి ప్రకాషం షాంతం ||
మహా కావ్య నాటకాది ప్రియం
మూషిక వాహనా మోధక ప్రియం ||
ఏ పనైనా చేసే ముందు గణపతిని మొక్కడం నాకు అలవాటు. ఇతే ఇలా మొక్కడం చాలా మందికి అలవాటే. నాకు కుడా ఇంతకముందు ఇది ఒక అలవాటే. చిన్నప్పటి నుంచి దేవుని ముందు నిలుచుని చేతులు జోడించి కోరికల చిట్టా విప్పడం అలవాటైపోయింది. ఆ ప్రార్థనలో భక్తి, నమ్మకంలాంటి వాటికంటే మొక్కకపోతే దేవుడికి కోపం వస్తుందేమో అన్న భయమే ఎక్కువగా వుండేది. అలవాటులో ప్రార్ధన చెయ్యటానికి నమ్మకంతో ప్రార్ధించడానికి చాలా వ్యత్యాసముందని ఈ మధ్యనే అర్ధమైంది.
నమ్మకంతో కూడిన ప్రార్ధనలో కోరుకోవడం వుండదు, ఎందుకంటే మన కోరిక మనకన్నా ముందు దేవునికి తెలుసనే నమ్మకం. అటువంటి ప్రార్ధనలో దేవుడికి హామీలు (కొబ్బరికాయలు కొట్టడం, తలనీలాలు ఇవ్వడం లాంటివి) ఉండవు, ఎందుకంటే దేవుడు మన ఆశలు తీర్చేవాడే కాని మన నుంచి ఏమి ఆశించడని తెలుసు కనుక. మన భారాన్ని ఆయనకి వదిలేసాక ఎమౌతుందో అన్న చింతలు ఉండవు, మనకి ఏది మంచిదో అయనకి తెలుసన్న నమ్మకం.
దేవుడు వున్నా లేకపోయినా ఉన్నాడనే నమ్మకంతో చేసే ప్రార్ధన మనసును తేలిక చేస్తుంది, మన గురించి జాగ్రత్త తీసుకొవడానికి ఒకరున్నారనే ధైర్యాన్నిస్తుంది.
No comments:
Post a Comment