Thursday, 24 June 2010

కొత్త బంగారులోకం

"ఓరేయ్ సినిమాకి వెల్దామ్రా" కిరణ్ గాడు అడిగాడు.
"అన్నం తిన్న వెంటనే ఇలాంటి ఆలోచనలే వస్తాయి వీడికి!!" అనుకున్నా నేను మనసులో. అదేమిటోగాని ఆకలేసినప్పుడు, ఆకలి తీరినప్పుడు కిరణ్ గాడు చాలా వింతగా ప్రవర్తిస్తాడు. వీడి ప్రపోసల్ ఇంకా పూర్తి అవ్వనేలేదు ముని గాడు డ్రెస్స్ వేసుకుని రెడీ అయిపోయాడు. ఇంక చేసేది లేక నేను, భరత్ కుడా భయలుదేరాం.'కొత్తబంగారు లొకం' బావుందంటే దానికి వెళ్దామని డిసైడ్ అయ్యాం. సెకండ్ షో అయినా రష్ బాగానే వుంది. పర్లేదు ఇతే సినిమా బాగానే వుంది అనమాట అనుకున్నా మనసులో. మా వెనుక మాలాగానే నలుగురు కుర్రాళ్ళు వచ్చి కూర్చున్నారు. వీళ్ళలో కిరణ్ గాడెవ్వరబ్బా?? అని నేను అలొచిస్తుండగానే సినిమా మోదలైంది.

అదేమిటో నాకు సినిమాలు అర్దంకాకనో లేక నిజంగానే సినిమాలు బాగోలేకనో నాకు తెలీదుకానీ నాకు చాలా సినిమాలు అంత త్వరగా నచ్చవు. కానీ ఎందుకో ఈ సినిమా బాగుంది. సినిమాలో నేను ఇన్వాల్వె అయిపోయి హీరోనే నేను, నేనే హీరో అయిపోయిన వేళ, నా చుట్టూ ఏమి జరుగుతోందో నేను గమనించె స్థితిలో నేను లేని వేళ, నేను చెప్పాల్సిన dialouge(నిజానికి సినిమాలో హీరో చెప్పాల్సిన dialouge)వెనుక వరుస నుంచి వినపడ్డది. అవ్వాక్కయి వెనక్కి తిరిగి చూశాను. వెనుక కుర్రాడు అప్పటికే సినిమా చుసాడు అని అర్దమైంది. నాలాగే తను కుడా సినిమాలో ఇన్వాల్వె అయిపొయి హీరో అయ్పొయాడని అనుకున్నా. నిజానికి నాలాగే ఫీల్ అయ్యెవాడు ఇంకొకడున్నాడని ముచ్చటేసింది. వినాయకుడు సినిమాలో హీరో క్రిష్ణుడు లాగ ఒక స్మైల్ ఇచ్చి మళ్ళి స్క్రీన్ వైపు తిరిగాను. రెండు నిమిషాలు గడిచాయొ లేదో " variety కదా...." అని మళ్ళీ వినపడింది, మొదట వెనుక నుంచి వినపడిన తర్వాత లేడి వాయిస్ లో మళ్ళి స్క్రీన్ మీదనుంచి వినపడింది. అప్పుడు మొదలైంది. బొమ్మ ముంధు కనిపిస్తుంటే మాట వెనక వినపడుతూ మళ్ళి అదే మాట స్క్రీన్ మీద వినపడుతూ వుంటే నా పరిస్థితి 'వివాహ భోజనమూ' సినిమాలో సుత్తి వీరభద్రావుకి దొరికిన బ్రహ్మానందంలాగా అయ్యింది నా పరిస్థితి. ఈలోపు మా అరవోడు (మునిగాడు అరవోడులెండి) "ఏమిరా కథ మొత్తం సెప్పేస్తాండాడు !!!" అంటూ మావాడు వాడి తెలుగరవం ( అదేనండి తెలుగు + అరవం )లో ఆశ్చర్యం వెల్లబుచ్చాడు. "నీకిప్పుడర్దమైందా ?? వెదవ వడివేలు మొహము నువ్వునూ" అనుకున్నాను నేను మనసులో.

మా బాధలు చూస్తున్నా కూడా వెనకాల వాడు కానీసం మమ్మల్ని కనికరించలేదు. ఇక మా నలుగురికి తిక్కలేచి వెనక్కి తిరిగి కూర్చున్నాం. స్క్ర్రీన్ చూడడం మానేశం వెనాక్కి తిరిగి వాడి మొహమే చుస్తున్నాం. మా అరవోడితే " ఆ ఇంకా తర్వత ఎమైనాది సెప్పుడా" అనడం మొదలుపెట్టాడు. పాపం వాడి మొహంలో రంగు పోయింది. నాకైతే జాలెసింది. కాని ఇంకొకసారి ఇలా చేయకుండా ఉంటాడనిపించింది.

No comments:

Post a Comment