Sunday 21 March 2010

ఎప్పుడో

ఖాళీ సమయం నా ద్రుష్టిలో చాలా విలువైనది. కొత్త విషయాలు నేర్చుకోవడం, ఇక ముందు చెయ్యవలసిన పనులను ప్లాన్ చేసుకోవడం లాంటివి పక్కన పెడితే మనం ఇది వరకే చేసిన పనుల ఒత్తిడి నుంచి, మనకి ఒత్తిడిని పెంచే ఎన్నో అలోచనల నుంచి మనం ఉపసమనం పొందడానికి మనకి దొరికే మంచి అవకాశం.

నాకు దొరికిన నా ఖాళీ సమయాన్ని నేను మామూలుగా నాకు నచ్చిన పాటలు వినడం ఒక మంచి సినిమా చూడటం లేదా నాకు మనసుకు దగ్గెరైన నా వాళ్ళతో లేదా దగ్గరి స్నేహితులతో వాకింగ్కి వెళ్ళడం వంటి పనులతో గడుపుతూ ఉంటాను. వీటిలో కూడా నాకు బాగా ఎక్కువగ నచ్చింది దగ్గరి వారితో బయటకి వెళ్ళటం అయిన నా మూడ్ ని బట్టి లేదా నేనున్న పరిసరాలను బట్టి ఎదో ఒకటి చేస్తూ వుంటాను. ఒకసారి పాటలు మంచి ఉపశమనంగా అనిపిస్తే మరోసారి మంచి సినిమా చూడటం మంచి ఉపాయంగా అనిపిస్తుంది కాని ప్రతిసారి ఒకటే మాత్రం ఎటువంటి పరిస్థితిలోనూ పనిచెయ్యదు.

గత కొద్ది కాలంగా నేను పాటలు వినడం సినిమాలు చూడడం మాత్రమే ఉపసమనోపాయలుగా వాడుతున్నాను. దీనికి ముఖ్యకారణం నేను మనసుకు దగ్గెరైన వారందరికి భౌతికంగా దూరంగా వుండడం ఇతే మరో కారణం నేను ఉన్న చోట ఎవరూ దగ్గెరివారు కాలేకపోవడం. ఎందుకో చాలా రోజుల తర్వాత చల్ల గాలిలో సాయంత్రం పూట అయినవాళ్ళతో నడవాలనిపిస్తోంది.

అది కుదిరేది ఎప్పుడో???

No comments:

Post a Comment